ఇంగ్లీషు మీడియం చదవడం ఇష్టం లేక భీమారం మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన అనుశ్రీ (16) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణాపూర్ లోని కస్తూర్బాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. 10 వరకు తెలుగు మీడియం చదివింది. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం కావడంతో ఇబ్బంది పడుతూ వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో తెలుగు మీడియం లో చేర్పిస్తానని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.