మందమర్రిలోని ప్రాణహిత కాలనీ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదగిరి శ్రీకాంత్ (24) కు తీవ్ర గాయాలైయినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. శ్రీకాంత్ బైక్ పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.