మందమర్రి: జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య

59చూసినవారు
మందమర్రి: జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య
మందమర్రిలోని దీపక్ నగర్ కి చెందిన ఊదురుకోట నవీన్ (33) అనే యువకుడు జీవితంపై విరక్తితో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం. డీగ్రీ వరకు చదువుకున్న నవీన్ కారు డ్రైవర్గా కొంత కాలం పనిచేశాడు. గతంలో మార్కెట్ ఏరియాలో బిజినెస్ పెట్టి రాణించలేక పోయాడు. ప్రస్తుతం ఎలాంటి జీవనోపాది లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులతో జీవితంపై విరక్తితో ఇంటి ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్