జన్నారం మండలంలో అక్రమ కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పొన్కల్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీలంక నగర్ కాలనీలో అక్రమంగా నిలువ ఉంచిన కలప దుంగలను పట్టుకున్నట్టు పేర్కొన్నారు. వాటి విలువ సుమారు 14000 ఉంటుందని వెల్లడించారు.