కుంటాల మండలంలోని సేవాలాల్ తండాకు చెందిన చౌహన్ అరవింద్ బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అరవింద్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర చారి తెలిపారు.