విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

52చూసినవారు
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
తానూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాలను సేవించడం వల్ల యువకులు అనారోగ్యాలకు గురవుతున్నారని, యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ లక్ష్య సాధనకై కష్టపడాలని ఏఎస్ఐ శాముల్ సూచించారు. ఇందులో ప్రిన్సిపల్ రాజశేఖర్, అధ్యాపకులు లక్ష్మణ్, నరేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్