ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ మృతి
లారీకి మరమ్మత్తులు చేస్తుండగా ఓ డ్రైవర్ మరణించిన ఘటన నేరేడి గొండ ఆరేపల్లి గ్రామ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రబ్బర్ లోడుతో తమిళనాడు నుండి ఢిల్లీకి వెళ్తుండగా అకస్మాత్తుగా లారీ నిలిచిపోయింది. డ్రైవర్ లారీని నిలిపి హ్యాండ్ బ్రేక్ వేయకుండా వెనుక టైర్ల వద్ద మరమ్మతులు చేస్తున్నాడు. అకస్మాత్తుగా లారీ వెనక్కి వచ్చి డ్రైవర్ పై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు.