హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. బహ్రా యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థిని.. సీనియర్లు ర్యాగింగ్ చేసి.. అతడ్ని హాస్టల్ గదిలో బంధించి కాలితో తన్నుతూ.. బెల్టులతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత మద్యం తాగమని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముగ్గురు సీనియర్ విద్యార్థులు కార్తీక్, కరణ్ డోగ్రా, విశాల్లను అరెస్ట్ చేశారు.