విడాకుల ప్రకటనపై నటుడు జయం రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని తెలిపారు. బహిరంగ ప్రకటన చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేశారు. ‘18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది’ అన్నారు. కాగా, భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.