పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్కతాలో మంగళవారం మరో ఘోరం జరిగింది. కదులుతున్న బస్సులో 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ భయంతో కేకలు వేయడంతో తోటి ప్రయాణీకులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే సమీపంలోని వ్యక్తులు అతన్ని పట్టుకుని కస్బా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. యువతి ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేశారు.