జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్‌ అత్యుత్సాహం.. మళ్లీ కటకటాలపాలు

72చూసినవారు
జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్‌ అత్యుత్సాహం.. మళ్లీ కటకటాలపాలు
జైలు నుంచి విడుదలైన ఓ గ్యాంగ్‌స్టర్‌ అత్యుత్సాహం ప్రదర్శించడంతో మళ్లీ కటకటాలపాలయ్యాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ హర్షద్‌ పాటంకర్‌ హత్యాయత్నం, దొంగతనాలు వంటి కేసుల్లో గతంలో అరెస్టై.. జులై 23న విడుదలయ్యాడు. దీంతో అతడి మద్దతుదారులు పెద్ద ఎత్తున ‘కమ్‌ బ్యాక్‌’ర్యాలీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవడంతో పోలీసులు హర్షద్‌పై చర్యలు చేపట్టారు. అనధికారిక ర్యాలీని చేపట్టినందుకు హర్షద్‌తోపాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్