ఐలమ్మ చేసిన పోరాటం బమ్మెర దర్దాపల్లి, పల్మాడి, మల్లపల్లి, ముత్తారం, వావిలాల మొదలైన గ్రామాల్లో ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది. నాలుగు గ్రామాల్లో గ్రామ రాజ్యాలు స్థాపించి పేద ప్రజలకు 10 లక్షల ఎకరాలకు పైగా భూమి పంపిణీ చేసిన ఆ మహత్తర పోరాటానికి తొలి ఘట్టం చాకలి ఐలమ్మ పోరాటం. ఐలమ్మ అన్నట్లే గడీల గడ్డిమొలిచింది. దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. నైజాం వ్యతిరేక పోరాటానికి ఊపిరిలూదిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న ఊపిరి వదిలింది.