తెలంగాణలో అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ నడుస్తుందిని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సక్కనోడు కాదు అని మేము అంటుంటే సక్కనోడు అని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటున్నారని చెప్పారు. రాజా సింగ్, రఘునందన్, బండి సంజయ్ వీళ్లంతా సీఎం మంచోడు అని సర్టిఫికెట్స్ ఇస్తున్నారని అన్నారు. మీ ప్రభుత్వ పథకం, మీ కేంద్ర ప్రభుత్వ పైసలు, చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి. 8 మంది ఎంపీలు ఉన్నారు ఇప్పటివరకు 8 పైసలు రాలేదని ఎద్దేవా చేశారు.