వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ పాలకవర్గం రూ.1,51,01,116 విరాళం అందజేసింది. బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కును పాలకవర్గం సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో TGCAB ఛైర్మన్ రవీందర్ రావు, వైస్ ఛైర్మన్ కె.సత్తయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు.