నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని, ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి, నల్గొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.