నిత్యావసరాల ధరల పెరగడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ప్రజలపై మరో భారం పడుతోంది. వర్షాలు, వరదల కారణంగా ఇతర రాష్ట్రాల్లో కూరగాయల దిగుబడి తగ్గింది. దాంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా టమాటా, ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం కిలో ఉల్లి రూ.60 ఉండగా.. ఇప్పుడు రూ.80కి చేరింది. గతవారం కిలో టమాటా రూ.50-60 ఉండగా.. ఇప్పుడు రూ.80-90 దాటేసింది. దసరా నాటికి ధరలు మరింత పెరిగే ఛాన్సుంది.