నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసుస్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.