అల్లు అర్జున్ నేషనల్ అవార్డును రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. 'పుష్ప సినిమా ఎర్రచందనం దొంగలను ప్రోత్సహించి సమాజానికి చెడు మెసేజ్ ఇచ్చింది. కొత్త దొంగలను తయారు చేయడంతో పాటు పోలీసుల మనోభావాలను దెబ్బతీసింది. ఇలాంటి సినిమాకు బన్నీకి ఇచ్చిన నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలి. పోలీసుల మనోభావాలు దెబ్బతీసిన డైరెక్టర్ సుకుమార్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలి' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.