దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేస్తా: భట్టి

85చూసినవారు
దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేస్తా: భట్టి
దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సోమవారం ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ చూడబోతున్నారని, త్వరలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్