TG: ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇంకా రైతు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని, ఇక తమకు మిగిలింది ఉరితాడేనని ఇచ్చోడ మండలం ముఖరా (కే) గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పంట పొలాల్లో తాడు కట్టి ఉరి పెట్టుకొని నిరసన తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే వేయాలని.. లేనిపక్షంలో తమకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.