ఒడిశాకు చెందిన సూక్ష్మ స్వర్ణకారుడు శ్రీకాంత్ అద్భుతం సృష్టించాడు. సూక్ష్మ బంగారు జగన్నాథుని రథాన్ని తయారుచేసి అబ్బుర పరిచాడు. దానిని చీమతో లాగించారు. దీనిని 0.580 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేశారు. ఈ రథం పొడవు 11.5 మి.మీ., వెడల్పు 8 మి.మీ., ఎత్తు 12 మి.మీ. పన్నెండు రోజుల పాటు శ్రమించి దీనిని తయారుచేసినట్లు శ్రీకాంత్ తెలిపారు. స్వాతిరెడ్డి అనే మహిళ ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.