షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రూఫస్ పేరుతో ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఏఐ అసిస్టెంట్‌ను భారత్ యూజర్లకూ పరిచయం చేసింది. అమెజాన్ మొబైల్ యాప్‌లో ఇది లభిస్తుంది. ప్రస్తుతానికి బీటా దశలో ఉన్న ఈ సదుపాయం.. మరికొన్ని రోజుల్లో అమెజాన్ యాప్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.