అమిత్ షాకు తప్పిన ప్రమాదం (వీడియో)

72624చూసినవారు
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షాకు సోమవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఎన. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన బీహార్‌లోని బెగుసరాయ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న చాపర్ నియంత్రణ కోల్పోయింది. టేకాఫ్ అయ్యే క్రమంలో చాపర్ కుడి వైపునకు ఊగుతూ భూమిని తాకబోయింది. కూలిపోతున్న తరుణంలో అప్రమత్తమైన పైలట్ చాపర్‌ను నియంత్రణలోకి తెచ్చారు. ఆ వెంటనే చాపర్ తిరిగి గమ్యస్థానం దిశగా సాగిపోయింది.