కార్య‌క‌ర్త కోరిక.. స్టైలిష్ లుక్‌లో సీఎం చంద్రబాబు

66చూసినవారు
AP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శ‌నివారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కార్యకర్తలతో సీఎం చంద్రబాబు స‌మావేశ‌మ‌వ్వ‌గా.. ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి ఓ మ‌హిళా కార్య‌క‌ర్త వ‌చ్చారు. ఈ క్ర‌మంలో నల్ల కళ్లద్దాలు ధ‌రించాల‌ని సీఎంకు ఆమె విజ్ఙ‌ప్తి చేశారు. మహిళ అభ్యర్థన మేరకు చంద్రబాబు నల్ల కళ్లద్దాలు ధ‌రించి ఫొటోకు పోజులిచ్చారు. దీంతో అక్కడున్న వారంతా జై బాబు అనే నినాదంతో హోరెత్తించారు.

ట్యాగ్స్ :