డోలీలో నిండు గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్ళిన కుటుంబ సభ్యులు

75చూసినవారు
డోలీలో నిండు గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్ళిన కుటుంబ సభ్యులు
అరకులోయ మండలం బస్కి పంచాయితీ కొంత్రాయిగూడకు చెందిన సమర్ధి డాలిమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. అయితే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహతులు కలసి డోలీలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే కిలో మీటర్ దాటిన తర్వాత అంబులెన్స్ రావడంతో దానిలో ఆసుపత్రికి తరలించారు. కొత్త ప్రభుత్వమైనా తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్