ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి

72చూసినవారు
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వేబ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెనపై రాంబన్‌ నుంచి రియాసికి రైలు సర్వీస్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా, కశ్మీర్‌ లోయలోని బారాముల్లా నుంచి సంగల్దాన్‌ వరకు రైల్వే సేవలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్