సైఫ్‌పై దాడి కేసులో మరో వ్యక్తి అరెస్ట్

58చూసినవారు
సైఫ్‌పై దాడి కేసులో మరో వ్యక్తి అరెస్ట్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన మహ్మద్ షరిఫుల్ ఇస్లామ్‌ను సైఫ్‌ నివాసానికి 35 కి.మీ దూరంలోని హీరానందానీ ఎస్టేట్‌లో ముంబై పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా, నిన్న ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌లో ఆకాష్ కనోజియా అనే వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :