రూ.2 లక్షల రైతు రుణాల మాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మరో 13 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని.. అర్హులైన రైతుల రుణమాఫీకి మరో రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమ కోసం బడ్జెట్‌లో రూ.50వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.