మణిపూర్‌లో మరో దారుణ ఘటన జరిగింది. మైతీ మిలిటెంట్లు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. శిబిరంలో తలదాచుకుంటున్న అతడి భార్య అదే రోజు బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డను చూసి ఆమె సంతోషించేలోపు భర్త మృతదేహం ఆ శిబిరానికి చేరింది. చురచంద్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హవోజోల్ అనే వ్యక్తి భార్య నెంగ్బోయ్ గర్భిణి. ఆమెకు కాన్పు కోసం ఆర్థిక సహాయం కోరేందుకు జిరిఘాట్కు అతడు వెళ్లాడు. అయితే మైతీ మిలిటెంట్లు హవోజోల్ను కిడ్నాప్ చేసి చంపారు.