ఓ స్కూల్‌లో విద్యార్థి-పీటీ ఉపాద్యాయుడి మధ్య తీవ్ర ఫైటింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక జీసీ ప్రైవేట్ పాఠశాలలో వార్షిక కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విద్యార్థి, ఆమె తల్లి, సోదరిని తీసుకొచ్చాడు. అయితే లోపలికి వెళ్లే ప్రవేశంపై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగి కొట్లాటకు దారి తీసింది. ఇద్దరూ కొట్టుకుంటుండగా విద్యార్థి తల్లి, సోదరి కూడా టీచర్‌పై దాడి చేశారు.