రేపు ఏపీ కేబినెట్ సమావేశం

84చూసినవారు
రేపు ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరుగనుంది. రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాలు రీ షెడ్యూల్ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాక, చెత్త పన్ను రద్దు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ తదితర అంశాలు చర్చకు రానున్నాయి.

ట్యాగ్స్ :