డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాల్స్ అనబడే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. రక్త నాళాలను ప్రశాంత పరుస్తాయి. దీంతో రక్తం సరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా బీపీ తగ్గుతుంది. గుండె పోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి.