మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు ఫలించడంతో తాము సమ్మె విరమిస్తున్నట్లు ఆరోగ్య మిత్రలు వెల్లడించారు. క్యాడర్ మార్పు, వేతనం రూ.15,600 నుంచి రూ.19,500కు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె విరమిస్తూ వారు లేఖ విడుదల చేశారు. రేపటి నుంచి యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవల విధుల్లో పాల్గొంటామని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి దామోదరకు వారు కృతజ్ఞతలు తెలిపారు.