ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన చివరి పోస్టు వైరల్ అవుతోంది. 3 రోజుల క్రితం ఆయన అనారోగ్యం బారిన పడినట్లు వదంతులు ప్రచారం చేయొద్దని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. దురుదృష్ణవశాత్తు పోస్టు పెట్టిన మూడు రోజులకే ఆయన కన్నుమూశారు.