సహారా ఎడారిలో వరదలు.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. సెప్టెంబర్ నెలలో ఒక రెండు రోజులు కురిసిన విపరీతమైన వర్షాలు మొరాకోలోని సహారా ఎడారిలో వరదలను సృష్టించాయి. ఈ వర్షాలతో లక్షల కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెల మీదుగా వరద ప్రవహిస్తోంది. ఎంతగా అంటే ఎడారిలో గత 50 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న ‘ఇరికీ’ సరస్సులో నీళ్లు నిలిచాయి. అయితే సూర్యుని చుట్టు భూమి తిరగడంలో మార్పులే కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.