తిరుమలలో కూలిన భారీ వృక్షం

62చూసినవారు
తిరుమలలో కూలిన భారీ వృక్షం
తిరుమలలో శనివారం సాయంత్రం భారీ వృక్షం నేలకూలి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. శేషాద్రి నగర్‌ 305వ కాటేజీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన మహిళ చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి(44)గా గుర్తించారు. తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో తిరుమలలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని, భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్