అయోధ్య నగరం విద్యుత్ దీపాల వెలుగులతో మెరిసిపోతోెంది. దీపావళిని పురస్కరించుకొని రామ మందిర పరిసరాలను శోభాయమానంగా ముస్తాబు చేశారు. మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగాక మొదటి దీపావళి కావడంతో UP ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సాకేతపురి, సరయూ తీరంలో 28 లక్షల పర్యావరణ హిత దీపాల ఏర్పాటు వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఈ పర్వదినాన ఏర్పాటు చేసిన డ్రోన్ షో కనులవిందు చేయనుంది.