హైదరాబాద్‌లోని పలు మాల్స్, థియేటర్స్, మల్టీ ప్లెక్స్‌లలోని ఫుడ్ స్టాల్స్‌లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేయగా కొన్ని చోట్ల ఫుడ్ స్టాల్స్‌లో అమ్ముతున్న తినుబండారాలు నాణ్యత లేనివిగా గుర్తించినట్లు తెలిపారు. కాలం చెల్లిన పదార్థాలను విక్రయించడంతో పాటు.. వాటిని ఆహారం తయారీలోనూ వినియోగిస్తున్నారని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన ఆయా మాల్స్, మల్టీప్లెక్స్‌లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.