'రైతు భరోసా'పై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

65చూసినవారు
'రైతు భరోసా'పై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ సాకుతో రైతు భరోసా ఆపొద్దని కేంద్రమంత్రి బండి సంజయ్‌ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. 'తెలంగాణలో ఇది కొనసాగుతున్న పథకమే.. రైతుల పొట్టకొట్టకండి. ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితం. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టారు. అవసరమైతే BJP తరఫున ECకి లేఖరాస్తాం. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించండి. అందరం కలిసి ECకి విజ్ఞప్తి చేద్దాం' అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్