బెంగళూరు రేవ్ పార్టీ.. తాను పాల్గొనలేదని ఖండించిన నటి హేమ

63చూసినవారు
బెంగళూరు రేవ్ పార్టీ.. తాను పాల్గొనలేదని ఖండించిన నటి హేమ
రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నా ఇప్పటికీ ఆమె బుకాయిస్తూనే ఉంది. రేవ్ పార్టీకి తనకి ఎలాంటి సంబంధం లేదని.. అసలు అందులో ఎవరున్నారో కూడా తనకి తెలియదని హేమ మొదటిగా స్పందించింది. తాను హైదరాబాద్‌లోనే రెండు రోజులుగా ఉన్నానని.. ఇక్కడే ఓ ఫామ్ హోస్‌లో చిల్ అవుతున్నట్లుగా తెలిపింది. అయితే దీనిని కర్ణాటక పోలీసులు ఖండించారు. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారంటూ ఫొటోను కూడా రిలీజ్ చేశారు.