అమెరికాలో మరో వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ..!

82చూసినవారు
అమెరికాలో మరో వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ..!
అమెరికాలో బర్డ్‌ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా మరో వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ సోకింది. అమెరికాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడం ఇది రెండోసారి. మిచిగాన్‌లోని ఓ రైతుకు ఈ బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పేర్కొంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ H5N1 సోకిన వ్యక్తి డెయిరీ ఫామ్‌లో పని చేస్తున్నట్లుగా తెలిపింది. సదరు వ్యక్తిలో స్థానిక అధికారులు బర్డ్‌ఫ్లూ లక్షణాలను గుర్తించినట్లు సీడీసీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్