ఇండిగో కీలక ప్రకటన

56చూసినవారు
ఇండిగో కీలక ప్రకటన
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. తమ విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది చివరికి బిజినెస్ క్లాస్ అందుబాటులోకి తెలిపింది. ఈ మేరకు గురువారం నాటి మార్కెట్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే బిజినెస్‌ క్లాస్‌ సేవల ప్రారంభ తేదీ, ఆఫర్లు, ఏయే మార్గాల్లో అందుబాటులో ఉండనున్నాయనే సమాచారాన్ని.. ఈ ఏడాది ఆగస్టులో జరిగే సంస్థ 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో వెల్లడిస్తామని పేర్కొంది.