నకిలీ బెదిరింపు కాల్స్‌ చేస్తే.. ఐదేళ్ల పాటు నిషేధం

74చూసినవారు
నకిలీ బెదిరింపు కాల్స్‌ చేస్తే.. ఐదేళ్ల పాటు నిషేధం
ఇటీవల కాలంలో విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు నకిలీ బాంబు కాల్స్‌ వస్తున్నాయి. వీటిని అరికట్టడానికి ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆలోచనలు చేస్తోంది. నకిలీ కాల్స్‌ కేసుల్లో దోషులుగా తేలితే.. ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు బీసీఏఎస్‌ వెల్లడించింది. ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వశాఖ ముందు ఉంచనున్నట్లు తెలిపింది.