కెనడా పార్లమెంట్‌లో నిజ్జర్‌కు నివాళి

78చూసినవారు
కెనడా పార్లమెంట్‌లో నిజ్జర్‌కు నివాళి
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య విషయంలో భారత్‌తో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ కెనడా పార్లమెంట్‌లో అతడికి సంతాపం ప్రకటించడం చర్చనీయాంశమైంది. నిజ్జర్ హత్య జరిగి మంగళవారానికి(జూన్‌ 18న) ఏడాదైన సందర్భంగా ట్రూడో సర్కారు అతడికి ప్రత్యేకంగా నివాళులర్పించడం గమనార్హం. ఏకంగా దేశ పార్లమెంట్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీలంతా నిలబడి మౌనం పాటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్