గోరింటాకు వల్ల కలిగే ప్రయోజనాలు

54చూసినవారు
గోరింటాకు వల్ల కలిగే ప్రయోజనాలు
ఆయుర్వేదంలో గోరింటాకును నోటి పూతకు, చర్మం, కాలేయ రోగాలకు ఔషధంగా వాడుతారు. అయితే దీనివల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకి రాసుకుంటే జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. గోరింటాకు నూనెను కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నచోట రాస్తే ఫలితం ఉంటుంది. ఈ ఆకు పొడిని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం రంగు మెరుగుపడుతుంది.

సంబంధిత పోస్ట్