ఖరీదైన కారును కొన్న బిగ్‌బాస్ బ్యూటీ

22083చూసినవారు
ఖరీదైన కారును కొన్న బిగ్‌బాస్ బ్యూటీ
అర్జున్ రెడ్డి సినిమాతో పాటు బిగ్‌బాస్-5తో పాపులర్ అయిన లహరి షారి తాజాగా కొత్త కారు కొనుక్కుంది. దీని విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఫిబ్రవరిలోనే ఈ బిగ్ బాస్ బ్యూటీ ఖరీదైన బీఎండబ్ల్యు బైక్ కొనుగోలు చేసింది. తాజాగా లగ్జరీ కారు కూడా కొనుగోలు చేసి, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. దీంతో బిగ్‌బాస్‌లోని సహచర కంటెస్టెంట్లతో సహా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక బిగ్‌బాస్ తర్వాత పలు ఆల్బమ్ సాంగ్స్‌లో లహరి నటించింది. కొన్ని సినిమాలలో కూడా కీలక పాత్రల్లో నటించనుందని, వాటికి కూడా ఇటీవల సైన్ చేసినట్లు తెలుస్తోంది.