ఇంద్రవెల్లి గతం కాదు.. ఓ నెత్తుటి జ్ఞాపకం

83చూసినవారు
ఇంద్రవెల్లి గతం కాదు.. ఓ నెత్తుటి జ్ఞాపకం
ఇంద్రవెల్లి గతం కాదు.. ఓ నెత్తుటి జ్ఞాపకం. ఏడాదికోసారి యాది చేసుకుంటే సరిపోదు. ఏ ఆశయం కోసం నాడు ఆదివాసీ గిరిజనులు అసువులు బాసారో వారి ఆశయాలు ఇంకా నెరవేరలేదు. ఓట్ల జాతరలో హామీల వర్షం కురిపించే నాయకులు అడవి బిడ్డలపై మొసలి కన్నీరు కార్చుతున్నారు. ఏళ్లు గడిచినా, ప్రభుత్వాలు మారినా వీరి బతుకుల్లో వెలుగుల్లేవు. ఈ చీకట్లు పోయి వెలుగులు వచ్చినప్పుడే ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల త్యాగాలకు నిజమైన నివాళి దక్కినట్లు.

సంబంధిత పోస్ట్