డాక్టర్లకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి: మంత్రి దామోదర

58చూసినవారు
డాక్టర్లకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి: మంత్రి దామోదర
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్యూటీ సమయంలో వారు ఆస్పత్రుల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బయోమెట్రిక్ మిషన్లు ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇన్ అండ్ అవుట్ హాజరును నమోదు చేయాలని స్పష్టం చేశారు. నెలలో కనీసం రెండు సార్లు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్