దేశంలో ఇటీవల విమానాలకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా మంగళవారం 32 ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. అంతేకాక, రెండు ఇండిగో విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 400కి పైగా విమానాలు బెదిరింపులను ఎదుర్కొన్నాయి.