తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన కలిసే పనిచేస్తాయి: పవన్

84చూసినవారు
తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన కలిసే పనిచేస్తాయి: పవన్
ఏపీలో జనసేన పార్టీ బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది. కూటమి ఘన విజయం సాధించడంతో పాటు జనసేన 21 సీట్లకు 21 గెలిచింది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కూడా బీజేపీతో జనసేన కలిసే పనిచేస్తుందని స్పష్టం చేశారు. కాగా పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు.

ట్యాగ్స్ :